CREDAI PROPERTY SHOW : సొంతింటి కల నెరవేర్చుకుందామనుకున్న విశాఖ వాసులకు ఎంవీపీ కాలనీలో నిర్వహించిన క్రెడాయ్ ప్రాపర్టీ షో-2021 ఎంతో ఉపయోగపడింది. మూడురోజుల పాటు సాగిన ప్రాపర్టీ షోలో పెద్దసంఖ్యలో కొనుగోలుదారులు పాల్గొని తమ అభిరుచికి తగిన ప్లాట్లు, స్థలాలు ఎంపిక చేసుకున్నారు. సుమారు వందకు పైగా స్థిరాస్తి సంస్థలు ఈ షోలో పాలుపంచుకున్నాయి. గృహ నిర్మాణ, స్థిరాస్తి ,హౌసింగ్ లోన్ లు అందించే బ్యాంకులు, గృహ నిర్మాణ సమయంలో వినియోగించే వస్తువుల కంపెనీలు, భద్రత అందించే సంస్థలు....ప్రాపర్టీ షోలో భాగస్వామ్యం అయ్యాయి. విశాఖతో పాటు ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి వచ్చిన కొనుగోలుదారులు ఆసక్తి చూపారు. గృహాలు, అపార్ట్ మెంట్ , విల్లాల కొనుగోళ్ల కోసం ఆరా తీశారు. నగర వాసులు నుంచి మంచి స్పందన రావడంతో క్రెడాయ్ ప్రాపర్టీ షో నిర్వాహకులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రాపర్టీ షో ముగింపు వేడుకల్లో స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
CREDAI PROPERTY SHOW : విశాఖలో క్రెడాయ్ ప్రాపర్టీ షో -2021.. పెద్దఎత్తున తరలివచ్చిన కొనుగోలుదారులు - విశాఖలో క్రెడాయ్ ప్రాపర్టీ షో
CREDAI PROPERTY SHOW : విశాఖలో మూడురోజుల పాటు నిర్వహించిన క్రెడాయ్ ప్రాపర్టీ షో -2021 విజయవంతమైంది. స్థిరాస్తి వ్యాపారులను, కొనుగోలుదారులను ఒకేచోటకు చేర్చడంతో ఇరువురికి లాభదాయకంగా మారింది. బ్యాంకులు స్టాళ్లను ఏర్పాటు చేయడంతో వినియోగదారులకు కలిసొచ్చింది. వీటితో పాటు గృహోపకరణాలకు సంబంధించిన స్టాళ్ల ప్రయోజనకరంగా మారాయి.
CREDAI PROPERTY SHOW
వినియోగదారుల నుంచి మంచి స్పందన లభించిందని స్టాళ్లు ఏర్పాటు చేసిన వివిధ సంస్థల ప్రతినిధులు తెలిపారు. ఇలాంటి ప్రాపర్టీ షో లు మరిన్ని నిర్వహిస్తే వినియోగదారులకు లాభదాయకమన్నారు. ప్రాపర్టీ షోలో పాల్గొన్న కొనుగోలుదారులకు నిర్వహించిన లక్కీ డ్రాలో గెలుపొందిన వారికి బహుమతులు అందజేశారు.
ఇదీ చదవండి