ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ముగిసిన క్రెడాయ్‌ ప్రోపర్టీ షో - రెండేళ్లలో భోగాపురం విమానాశ్రయం పూర్తవుతుందన్న అమర్నాథ్‌ - క్రెడాయ్ ప్రాపర్టీ షో

Credai Property Show in MVP Colony: సామాన్యుల సొంత ఇంటి కలను నెరవేర్చడం కోసం విశాఖ క్రెడాయ్‌ ఏటా నిర్వహించే ప్రాపర్టీ షో ఈ ఏడాది విశాఖ ఎంవీపీ కాలనీలోని గాది రాజు ప్యాలెస్‌లో ఘనంగా ముగిసింది. మూడు రోజుల పాటు నిర్వహించిన ఈ ప్రాపర్టీ షో ముగింపు వేడుకకు మంత్రి గుడివాడ అమర్నాథ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

Credai_Property_Show_in_MVP_Colony
Credai_Property_Show_in_MVP_Colony

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 26, 2023, 12:30 PM IST

ముగిసిన క్రెడాయ్‌ ప్రోపర్టీ షో - రెండేళ్లలో భోగాపురం విమానాశ్రయం పూర్తవుతుందన్న అమర్నాథ్‌

Credai Property Show in MVP Colony :విశాఖ ఎంవీపీ కాలనీలోని గాది రాజు ప్యాలెస్‌లో క్రెడాయ్‌ నిర్వహించిన మూడు రోజుల ప్రోపర్టీ షో సోమవారం ఘనంగా ముగిసింది. ప్రపంచంలోనే అద్భుత నగరంగా విశాఖ అవతరిస్తున్న వేళ క్రెడాయ్‌ సొంత ఇంటి కల నెరవేర్చే దిశగా ఈ ప్రాపర్టీ షోని నిర్వహించడం అభినందనీయమని మంత్రి గుడివాడ అమర్నాథ్‌ అన్నారు.

Credai Property Show Closing Ceremony in Vishakha : వినియోగదారులకు కావలసిన అన్ని సౌకర్యాలు ఒకే చోట కొలువుతీరిన వేదిక, విశాఖ విశాఖ క్రెడాయ్‌ ప్రాపర్టీ షోలో పాల్గొన్న గృహ నిర్మాణ సంస్థల యజమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. గత 8 ఏళ్ల నుంచి నిర్విరామంగా సాగుతున్న ఈ ప్రాపర్టీ షో చక్కటి ఫలితాలను ఇచ్చిందని చెప్తున్నారు. కేవలం ఇల్లు, స్థలాలు, ప్లాట్లు, విల్లాలు వివరాలు మాత్రమే కాకుండా వినియోగదాలకు అవసరమైన గృహ రుణాలకు స్టేట్ బ్యాంకుతో సహా ఇతర బ్యాంకుల వెను వెంటనే సహకారం అందిస్తున్నాయి.

విశాఖ క్రెడాయి ప్రోపర్టీ షో - వినియోగదారులకు కావల్సినవి అన్ని ఒకే చోట

Minister Amarnath Attended Credai Property Show :మూడు రోజులు పాటు సాగిన క్రీడాయి విశాఖ ప్రాపర్టీ షో తమకు ఎంత మేలు చేసిందని పాల్గొన్న గృహ నిర్మాణ వివిధ సంస్థల ప్రతినిధులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అదే విధంగానిర్మాణ రంగంలో వచ్చిన నూతన ఆధునిక పద్ధతులు, హంగులు సంబంధించిన స్టాల్స్ ఏర్పాటు చేయడంపై మంచి స్పందన ఉందని నిర్మాణ సంస్థల ప్రతినిధులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సుమారు 50 కి పైగా స్టాల్స్ వినియోగదారులకు ఒకచోట కొలువుతీరి అటు సమాచారం, ఇటు సహకారం ఇచ్చి, నూతన ఇంటికలను నెరవేర్చడానికి గొప్ప అవకాశంగా అభివర్ణిస్తున్నారు.

విశాఖలో క్రెడాయ్ ప్రాపర్టీ షో - 'స్థిరాస్తిపై ప్రతి రూపాయికీ భరోసా'

ఏడాది ఏడాదికి మంచి స్పందన ఉత్తరాంధ్ర ప్రజలను వస్తోందని హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రాపర్టీ షోలో స్టాల్స్ పెట్టిన యజమానులకు విశాఖపట్నం నుంచి మంచి ఆదరణ లభించిందని, చాలామంది నేరుగా స్థలాలకు వెళ్లి పరిశీలించుకుని వచ్చి తమ నూతన ఏంటి కల సహకారం చేసుకుంటున్నారని నిర్వాహకులు చెప్పారు. ఏ లక్ష్యం తో ఈ షో నిర్వహిస్తున్నారో ఆ లక్ష్యం నెరవేరుతుందని ఆనందం వ్యక్తం చేశారు.
అప్పుడే భోగాపురం ఎయిర్‌పోర్ట్‌ రన్‌వే మీద మొదటి విమానం : క్రెడాయి ప్రోపర్టీ షోలో పాల్గొన్న సంస్థలకు, బ్యాంకులకు మంత్రి అమర్నాథ్‌, నిర్వాహకులు జ్ఞాపికలను అందజేశారు. వినియోగదారులకు 5 గ్రాముల బంగారం లక్కీ డిప్‌గా, సూపర్ ప్రైజ్‌గా హోండా యాక్టివా వాహనాన్ని అందజేశారు. 2025 డిసెంబర్‌ నాటికి భోగాపురం ఎయిర్‌పోర్ట్‌ రన్‌వే మీద మొదటి విమానం నడుస్తుందని మంత్రి అమర్నాథ్‌ అన్నారు. విశాఖ నివాసయోగ్య నగరంగా, అనకాపల్లి పరిశ్రమలకు అనుకూల ప్రాంతంగా నిర్దేశించినట్లు మంత్రి తెలిపారు.

CREDAI PROPERTY SHOW : విశాఖలో క్రెడాయ్‌ ప్రాపర్టీ షో -2021.. పెద్దఎత్తున తరలివచ్చిన కొనుగోలుదారులు

ABOUT THE AUTHOR

...view details