రాష్ట్ర ప్రభుత్వం ఇసుకను అందుబాటులో ఉంచాలని క్రెడాయ్ (కాన్ఫెడరేషన్ ఆఫ్ రియల్ ఎస్టేట్ డెవలపర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా) ఛైర్మన్ కోటేశ్వరరావు కోరారు. కరోనా కారణంగా రియల్ ఎస్టేట్ రంగం తీవ్రంగా నష్టపోయిందని ఆయన అన్నారు. విశాఖలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం టన్ను ఇసుక రూ.375గా నిర్ణయించినా, ప్రభుత్వశాఖల మధ్య సమన్వయ లోపంతో రూ.1700 నుంచి రూ.2వేల వరకు చెల్లించాల్సి వస్తోందన్నారు.
ఇసుక, ఇతర నిర్మాణ సామగ్రి ధరలు పెరగడంతో అపార్టుమెంట్లలో ఫ్లాట్లలకు యూనిట్ ధర రూ.150 వరకు అధికంగా అవుతోందన్నారు. వెబ్‌పోర్టల్‌లో అనుమతుల కోసం తీవ్ర జాప్యం కలుగుతోందని, శ్రీకాకుళం, తూర్పుగోదావరి జిల్లాల నుంచి ఇసుక తీసుకొస్తుండటంతో రవాణా ఖర్చులు భారీగా పెరుగుతున్నాయన్నారు.