ప్రభుత్వం రాజధాని విషయంలో ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలపై క్రెడాయ్ స్పందించదని ఆ సంస్థ అధ్యక్షుడు సుధాకర్ స్పష్టం చేశారు. క్రెడాయ్ ఏపీ ఛైర్మన్‌గా కొనసాగుతూ అమరావతి జేఏసీ కన్వీనర్‌గా బాధ్యతలు తీసుకున్న శివారెడ్డి ఛైర్మన్ పదవికి రాజీనామా చేశారని ఆయన వెల్లడించారు. విశాఖలో జరిగిన క్రెడాయ్ ఏపీ మేనేజింగ్ కమిటీ సమావేశంలో శివారెడ్డి రాజీనామాను ఆమోదించినట్లు సుధాకర్ తెలిపారు. నూతన ఛైర్మన్‌గా సుబ్బరాజును నియమించుకున్నట్లు వెల్లడించారు. నిర్మాణ రంగ సంబంధిత విషయాలపై మాత్రమే క్రెడాయ్ బాధ్యత తీసుకుంటుందని ఆయన చెప్పారు. రాజధాని ఎక్కడ ఉండాలనే విషయంపై క్రెడాయ్ ఏపీకి ప్రత్యేక అభిప్రాయాలు ఏమీ లేవని నూతన ఛైర్మన్ సుబ్బరాజు తెలిపారు.
క్రెడాయ్ ఏపీ ఛైర్మన్ శివారెడ్డి రాజీనామా - Credai Chairman sivareddy Resigned
ప్రస్తుతం రాజధాని విషయంలో క్రెడాయ్ స్పందించదని సంస్థ అధ్యక్షుడు సుధాకర్ తెలిపారు. క్రెడాయ్ ఏపీ ఛైర్మన్ పదవికి శివారెడ్డి రాజీనామా చేశారని.... ఆయన స్థానంలో సుబ్బరాజును నియమించామని వెల్లడించారు.
క్రెడాయ్-ఏపీ ఛైర్మన్ శివారెడ్డి రాజీనామా