విశాఖ మారియట్ హోటల్ అధినేత, తొలితరం పారిశ్రామికవేత్త కనుమూరి సుబ్బరాజు బుధవారం రాత్రి తుది శ్వాస విడిచారు. కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న సుబ్బరాజు ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. సుబ్బరాజు క్రెడాయ్ రాష్ట్ర ఛైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు. ఆయన విశాఖ క్షత్రియ సంఘం అధ్యక్షుడిగా గతంలో సేవలు అందించారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం సమీపంలో ఉన్న దిరుసుమర్రు గ్రామానికి చెందిన సుబ్బరాజు, సుమారు 40 ఏళ్ల కిందట విశాఖకు వచ్చి బిల్డర్‌గా స్థిరపడ్డారు. కేఎస్ఆర్ డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఎండీగా నగరంలో పలు అపార్టుమెంట్ల నిర్మాణాలు చేపట్టారు.
మారియట్ హోటల్ అధినేత కనుమూరి సుబ్బరాజు కన్నుమూత - క్రెడాయ్ ఛైర్మన్ మృతి రీసెంట్ న్యూస్
విశాఖ మారియట్ హోటల్ అధినేత కనుమూరి సుబ్బరాజు కన్నుమూశారు. అనారోగ్యంతో చికిత్స పొందుతూ ప్రైవేటు ఆసుపత్రిలో తుది శ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు.
క్రెడాయ్ రాష్ట్ర ఛైర్మన్ కన్నుమూత