విశాఖ ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీకేజీ బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని సీపీఎం విశాఖ నగర కార్యదర్శి డాక్టర్ బి. గంగారం ఆగ్రహం వ్యక్తం చేశారు. సీపీఎం బృందం బాధిత గ్రామాల్లో పర్యటించింది. ప్రభుత్వం, వైద్యుల నిర్లక్ష్యం కారణంగా గ్యాస్ లీకేజీ బాధితుడు కనకరాజు మృతిచెందాడని విచారం వ్యక్తం చేశాడు. వారి కుటుంబాని తక్షణం కోటి రూపాయల నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.
గ్యాస్ లీక్ బాధితులను ఆదుకోవడంలో నిర్లక్ష్యం: సీపీఎం - lg poymers incident news
ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీక్ బాధిత గ్రామాల్లో సీపీఎం నేతలు పర్యటించారు. బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని సీపీఎం నేతలు ఆరోపించారు.
గ్యాస్ లీక్ బాధిత గ్రామాల్లో సీపీఎం పర్యటన