ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'హెచ్ పీసీఎల్ ప్రమాదంపై తక్షణమే విచారణ చేయాలి' - CPM concern over HPCL accident

హెచ్ పీసీఎల్ లోని క్రూడ్ డిస్టీలేషన్ యూనిట్ లో జరిగిన ప్రమాదంపై సీపీఎం విశాఖ నగర కమిటీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. తక్షణమే ఈ ప్రమాదంపై సమగ్ర విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేసింది.

CPM GVMC Corporator Gangarao
సీపీఎం జీవీఎంసీ కార్పొరేటర్ గంగారావు

By

Published : May 26, 2021, 10:09 AM IST

హెచ్ పీసీఎల్ లోని క్రూడ్ డిస్టీలేషన్ యూనిట్ లో జరిగిన ప్రమాదంపై సీపీఎం విశాఖ నగర కమిటీ విచారం వ్యక్తం చేసింది. హెచ్ పీసీఎల్ లో క్రూడ్ డిస్టిలేషన్ యూనిట్ కెపాసిటీ పెంచటానికి మోడరైజేషన్ ప్రక్రియను ఎల్&టి సంస్థ చేస్తోందని.. ఈ పనులపై కూడా సమగ్ర తనిఖీ జరపాలని సీపీఎం జీవీఎంసీ కార్పొరేటర్ గంగారావు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం వల్ల ఈ ప్రమాదాలు రోజు రోజుకి పెరిగిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. మరో వైపు ప్రజలపై తీవ్ర విషకాలుష్యాన్ని కూడా వెదజల్లుతున్నాయని విమర్శించారు. కేంద్రంలో భాజపా అధికారంలోకి వచ్చిన తరువాత పరిశ్రమల భద్రతా ప్రమాణాలు, పర్యావరణ సంస్థల అధికారాలన్నింటిని బలహీనం చేసిందని విమర్శించారు. తక్షణమే ఈ పారిశ్రామిక ప్రమాదాల నుంచి విశాఖ ప్రజలను కాపాడాలని అలాగే ఈ ప్రమాదాల నివారణకు అన్ని రకాల చర్యలు తీసుకోవాలని సీపీఎం పార్టీ కోరుతుందని తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details