పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించాలని సీపీఎం ఆధ్వర్యంలో నిరసన - increase petrol and diesel prices latest news
పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలను వెంటనే తగ్గించాలని కోరుతూ విశాఖలో సీపీఎం ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గినా, దేశీయంగా పెట్రో ధరలను పెంచడం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు.
కేంద్ర ప్రభుత్వం పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలను వెంటనే తగ్గించాలని కోరుతూ విశాఖలో సీపీఎం కార్యకర్తలు నిరసన చేపట్టారు. నగరంలో జ్ఞానాపురం ప్రాంతంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో సీపీఎం నాయకుడు బీఎంకే మహేంద్ర పాల్గొన్నారు. కరోనా కష్టకాలంలో సామాన్యులకు ఆర్థిక సాయం చేయాల్సిన కేంద్రం ఇలాంటి సమయంలో పెట్రోల్ ధరలను విపరీతంగా పెంచుతోందని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా వాటర్ టాక్స్ తగ్గించి ప్రజలకు పెట్రో భారాన్ని కొంత మేరకు తగ్గించవచ్చు అని ఈ సందర్భంగా సూచించారు. ఈ కార్యక్రమంలో జి.దాసు, నిర్మాణ కార్మిక సంఘం నాయకులు ఎం.ప్రకాష్, అప్పారావు, కిషోర్ పలువురు ఆటో కార్మికులు పాల్గొన్నారు.