'లేటరైట్ తవ్వకాలకు ఇచ్చిన అనుమతులు రద్దు చేయండి' - cpm protest in visakha news
కే.దద్దుగుల గ్రామ శివారులో లేటరైట్ తవ్వకాలకు ఇచ్చిన అనుమతులను రద్దు చేసి సాగు చేస్తున్న వారికి పట్టాలు ఇవ్వాలని సీపీఎం నేతలు విజ్ఞప్తి చేశారు. నర్సీపట్నంలోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో వినతిపత్రాన్ని అందజేశారు.
సబ్ కలెక్టర్ కార్యాలయంలో వినతిపత్రం ఇస్తున్న దృశ్యం
విశాఖ జిల్లా నాతవరం మండలం సరుగుడు పంచాయతీ శివారు కే.దద్దుగుల గ్రామ శివారులో… లేటరైట్ తవ్వకాలకు ఇచ్చిన అనుమతులను రద్దుచేసి సాగు చేస్తున్న వారికి పట్టాలు మంజూరు చేయాలని సీపీఎం విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు నర్సీపట్నంలోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో వినతిపత్రాన్ని అందజేశారు. తవ్వకాలకు అనుమతులు ఇస్తే అదే ప్రాంతంలో జీవిస్తున్న గిరిజనుల మనుగడకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని పేర్కొన్నారు. తక్షణమే లీజు అనుమతులు రద్దు చేయాలని కోరారు.