ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'డీడీలు కట్టించుకున్నారు కానీ ఇళ్లు ఇవ్వలేదు' - విశాఖ నగరం

విశాఖలో ప్రభుత్వం నిర్మిస్తున్న గృహాలను సత్వరం పూర్తి చేసి.. లబ్ధిదారులకు అందజేయాలని సీపీఎం డిమాండ్ చేసింది.

vishakapatnam
డీడీలు కట్టించుకున్నారు కానీ ఇళ్లు ఇవ్వలేదు

By

Published : Jul 22, 2020, 12:26 AM IST

విశాఖ నగరంలోని చాకలి గెడ్డ ప్రాంతంలో నిర్మిస్తున్న ఇళ్లను వెంటనే పూర్తిచేసి డీడీలు కట్టిన లబ్ధిదారులకు అందజేయాలని సీపీఎం నాయకురాలు బొట్ట ఈశ్వరమ్మ డిమాండ్ చేశారు. గత ప్రభుత్వ హయాంలో ఇల్లు లేనివారికి ఇల్లు ఇస్తామని 25000, 12,500, 500 రూపాయలు చొప్పున డీడీలు కట్టించారని ఆమె గుర్తు చేశారు. వీరికి తక్షణమే ఇల్లు నిర్మాణం పూర్తి చేసి ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.

లబ్ధిదారులకు గృహాలను ఇస్తామంటూ.. లబ్ధిదారులను జాబితా నుంచి తొలగించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. కార్యక్రమంలో సీపీఎం నాయకులు ఎం. సింహాచలం, ఒ, అప్పారావు, పుష్ప, మోహన్ తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చదవండిమద్యం షాపులే కరోనా వ్యాప్తికి ప్రధాన కారణం: ఎమ్మెల్యే గణబాబు

ABOUT THE AUTHOR

...view details