కరోనా మహమ్మారి విజృంభిస్తున్న వేళ మద్యం దుకాణాలను తెరిచే నిర్ణయం తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వ చర్యలను సీపీఎం ఖండించింది. విశాఖలో నిరసన కార్యక్రమం చేపట్టింది. 'తిండి కావాలి మద్యం వద్దు' అంటూ ప్లకార్డులు ధరించి సీపీఎం కార్యకర్తలు నినాదాలు చేశారు.
రాష్ట్ర ప్రభుత్వం ఆదాయం కోసం మద్యం దుకాణాలను తెరిచిందని.. కరోనా మహమ్మారి విజృంభిస్తున్న సమయంలో మద్యం దుకాణాల వద్ద పెద్ద ఎత్తున ప్రజలు గుమిగూడుతున్నారని సీపీఎం నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. కరోనా మరింత వ్యాప్తి చెందే ప్రమాదం ఉందన్నారు. ప్రభుత్వం 25% మద్యం రేట్లు పెంచింది కాబట్టి.. మద్యం విక్రయాలు తగ్గుతాయన్న వాదనలో నిజం లేదని అన్నారు.