ముఖ్యమంత్రి జగన్ విశాఖ పర్యటన సందర్భంగా పంచ గ్రామాల సమస్యలు పరిష్కరించాలని, భూ సమీకరణ నిలిపివేయాలని విజ్ఞప్తి చేసేందుకు సమైక్య రైతు ప్రజా సంక్షేమ సంఘం నాయకులు నిర్ణయించుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు వారిని ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు తీరుపై సీపీఎం నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. విశాఖ కలెక్టరేట్ ఎదుట నిరసన చేపట్టారు. అరెస్టు చేసిన తమ నాయకులు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
ముందస్తు అరెస్టులపై సీపీఎం ఆగ్రహం.. - విశాఖలో సీపీఎం నేతల అరెస్టు
సీఎం జగన్ విశాఖ పర్యటన నేపథ్యంలో సమైక్య రైతు ప్రజా సంక్షేమ సంఘం నాయకులను ముందస్తుగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన సీపీఎం నాయకులు కలెక్టరేట్ ఎదుట ఆందోళనకు దిగారు.
కలెక్టరేట్ ఎదుట ఆందోళన