విశాఖలోని అల్లూరి విజ్ఞాన కేంద్రం వేదికగా జరుగుతున్న ఆదివాసీ అధికార రాష్ట్రీయ మంచ్ జాతీయ సమావేశాలకు.. సీపీఎం జాతీయ నేతలు బృందా కారత్, మాజీ ఎంపీ జితిన్ చౌదరి సహా ప్రముఖులు హాజరయ్యారు. సమావేశాల్లో మాట్లాడిన నేతలు.. గిరిజనులు, ఆదివాసీ తెగల త్యాగాలను కొనియాడారు. వాస్తవానికి.. బ్రిటిష్ పాలకులపై పోరాటాన్ని మొదలుపెట్టింది.. ఆదివాసీలేనని బృందా కారత్ అన్నారు.
ఈ నేల, సాంస్కృతిక సంపద మూలాల పరిరక్షణ కోసం.. ఆదివాసీలు, గిరిజన తెగలు గొప్ప త్యాగాలు చేశారని కొనియాడారు. అలాంటి ఆదివాసీలకు.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అన్యాయం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వైకాపా సామాజిక న్యాయ భేరీ బస్సు యాత్ర వల్ల ప్రజలకు ఏం మేలు జరుగుతోందో చెప్పాలని.. త్రిపురకు చెందిన మాజీ ఎంపీ, ఆదివాసీ హక్కుల సమితి జాతీయ నేత.. జితిన్ చౌదరి ప్రశ్నించారు. సామాజిక న్యాయంపై గొప్పలు చెప్పుకుంటున్న రాష్ట్ర ప్రభుత్వం.. జీవో నెంబర్ 3పై.. ఎందుకు నోరు మెదపడం లేదని నిలదీశారు.