ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పాల ధరల పెంపును నిరసిస్తూ.. సీపీఎం ఆందోళన - cpm leaders protest at vishaka

కరోనా కాలంలో.. ప్రభుత్వం పాల ధరలను పెంచి సామాన్య ప్రజలను మరింత ఇబ్బందుల్లోకి నెట్టిందని సీపీఎం నాయకులు ఆరోపించారు. పెంచిన ధరలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ.. విజయవాడ మిల్క్ యునియన్ ప్రాజెక్టు వద్ద నిరసన చేపట్టారు.

milk
పెంచిన పాలధరలను తగ్గించాలని సీపీఎం నాయకుల నిరసన

By

Published : May 1, 2021, 8:14 PM IST

విజయ పాల ధరల పెంపును నిరసిస్తూ.. సీపీఎం ఆధ్వర్యంలో విజయవాడ మిల్క్ యునియన్ ప్రాజెక్టు వద్ద నిరసన చేపట్టారు. కరోనా కష్టకాలంలో ప్రజలను ఆదుకోవాల్సింది పోయి.. ఇలా ధరలు పెంచి సామాన్య, మధ్య తరగతి వర్గాలకు భారం పెంచారని.. సీపీఎం నేత బోయ సత్తిబాబు ఆగ్రహించారు. పాల ధరలను నియంత్రించకపోతే.. రాబోయే రోజుల్లో పార్టీ తరపున పెద్దఎత్తున నిరనలు చేపడతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details