విశాఖ కేజీహెచ్ వద్ద సీపీఎం నాయకులను పోలీసులు అరెస్టు చేశారు. ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీక్ ఘటనలో చికిత్స పొందుతున్న క్షతగాత్రుల పరిస్థితి తెలుసుకునేందుకు వెళ్లిన సీపీఎం నగర కార్యదర్శి గంగారావు, సుబ్బారావు, చంద్రశేఖర్ లను ఒకటో పట్టణ పోలీసులు అరెస్టు చేశారు.
ప్రభుత్వం బాధితులకు న్యాయం చెయ్యకుండా, ప్రమాదానికి కారణమైన కంపెనీ యాజమాన్యాన్ని అరెస్టు చేయకుండా.. బాధితుల ఆరోగ్య పరిస్థితిని తెలుసుకునేందుకు వెళ్లిన వారిని అరెస్టు చేయడం దుర్మార్గమని సీపీఎం నాయకులు ఆగ్రహించారు.