'స్టీల్ ప్లాంట్ నిర్వాసితులకు న్యాయం చెయ్యండి' - విశాఖ స్టీల్ ప్లాంట్ నిర్వాసితుల అవస్తలు
విశాఖ స్టీల్ ప్లాంట్ నిర్వాసితులకు ఉక్కు యాజమాన్యం వెంటనే పరిహారం చెల్లించాలని సీపీఎం జిల్లా కార్యదర్శి సీహెచ్ నర్సింగరావు డిమాండ్ చేశారు. స్టీల్ ప్లాంట్ స్థాపనకు భూములు ఇచ్చిన అగనంపూడిలోని రెండు గ్రామాల ప్రజలకు ఇప్పటికీ పరిహారం చెల్లించలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. వారంతా సుమారు మూడు దశాబ్దాలుగా పూరి పాకలోనే నివసిస్తున్నా...యాజమాన్యం పట్టించుకోవట్లేదన్నారు. ప్రభుత్వం జోక్యం చేసుకుని ప్లాంట్ నిర్వాసితులు అందరికీ న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని కోరారు.
cpm
.