ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'రాజకీయాలకతీతంగా.. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను అడ్డుకుంటాం' - CPM corporator Dr Gangarao on bicycle latest news update

'విశాఖ ఉక్కును ప్రైవేట్ పరం కానివ్వం' అనే ప్లకార్డును ప్రదర్శిస్తూ సైకిల్​పై ప్రమాణస్వీకారానికి హాజరయ్యారు.. సీపీఎం కార్పొరేటర్ డాక్టర్.బి. గంగారావు. ఉక్కు కర్మాగారం నివాస ప్రాంతం 78వ వార్డు నుంచి సీపీఎం తరుపున ఆయన పోటీ చేసి గెలుపొందారు.

CPM corporator Dr Gangarao
సైకిల్​పై ప్రమాణస్వీకారానికి హాజరైన సీపీఎ కార్పొరేటర్ గంగారావు

By

Published : Mar 18, 2021, 8:03 PM IST

మహా విశాఖ నగర పాలక సంస్థ కౌన్సిల్ ప్రమాణ స్వీకారం ఉత్సవం సందర్భంగా.. సీపీఎం కార్పొరేటర్ డాక్టర్.బి. గంగారావు వినూత్నంగా నిరసన తెలిపారు. 'విశాఖ ఉక్కును ప్రైవేట్ పరం కానివ్వం' అనే ప్లకార్డును ప్రదర్శిస్తూ సైకిల్​పై ప్రమాణస్వీకారానికి హాజరయ్యారు. మద్దిలపాలెంలోని నగర సీపీఎం కార్యాలయం నుంచి సైకిల్ పై బయలుదేరిన ఆయన జీవీఎంసీ ప్రధాన కార్యాలయానికి చేరుకున్నారు. నూతనంగా ఎన్నికైన కార్పొరేటర్లు అందరితో కలిసి, రాజకీయాలకతీతంగా.. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఉద్యమిస్తాం అని గంగారావు స్పష్టం చేశారు. ఉక్కు కర్మాగారం నివాస ప్రాంతం 78వ వార్డు నుంచి డాక్టర్. బి గంగారాం సీపీఎం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details