టిడ్కో ఇళ్లలో.. ప్రవేశాలకు వచ్చిన సీపీఐ నాయకులను విశాఖ పీఏంపాలెం పోలీసులు అరెస్ట్ చేశారు. మధురవాడ వాంబే కాలనీ సమీపంలో గత ప్రభుత్వం టిడ్కో ఇళ్లు నిర్మిచింది. అక్కడే నివాసం ఉన్న రజకులను ఖాళీ చేయించి.. అందులో ఇళ్లు ఇస్తామని చెప్పారు. ఇళ్లు పూర్తయి ఏళ్లు గడుస్తున్నా.. అవి లబ్ధిదారులకు అప్పగించలేదు. ఈ క్రమంలో సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి జేవీ.సత్యనారాయణ ఆధ్వర్యంలో లబ్ధిదారులతో కలసి గృహప్రవేశాలకు వచ్చారు. పోలీసులు వారిని అడ్డుకొని అదుపులోకి తీసుకున్నారు.
విశాఖలో టిడ్కో గృహప్రవేశాలకు యత్నం.. సీపీఐ నేతల అరెస్ట్ - విశాఖలో సీపీఐ నేతలు ధర్నా
తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో నిర్మించిన టిడ్కో ఇళ్లలో.. గృహప్రవేశాలకు సీపీఐ ఇచ్చిన పిలుపు.. రాష్ట్రంలో ఉద్రిక్తతలకు దారితీసింది. పలుచోట్ల తెదేపా, సీపీఐ నాయకులను.. పోలీసులు ముందస్తుగా గృహనిర్బంధం చేశారు. మరికొంత మంది నాయకులను అరెస్టు చేసి పోలీస్‌స్టేషన్లకు తరలించారు.
cpm arrest in vishakapatnam