ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'అన్నం తినేవాళ్లు అన్నదాతల ర్యాలీకి మద్దతు ఇవ్వాలి' - సీపీఐ వార్తలు

అన్నం తినేవాళ్లు అందరూ 26న అన్నదాతలు చేయనున్న ర్యాలీకి మద్దతు ఇవ్వాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు. వ్యవసాయ చట్టాల వెనుక అంబానీ, ఆదానీల ఒత్తిడి ఉందని తెలిపారు. దిల్లీలో రైతులు చేస్తున్న పోరాటం చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించదగినది పేర్కొన్నారు.

CPI state secretary Ramakrishna comments
అన్నదాతల ర్యాలీకి మద్దతు

By

Published : Jan 24, 2021, 3:45 PM IST

దిల్లీలో రైతులు చేస్తున్న పోరాటం చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించదగినది అని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు. వ్యవసాయ చట్టాలపై విశాఖలో సమావేశం నిర్వహించారు. కరోనాతో ప్రజలు అల్లాడిపోతుంటే వ్యవసాయ చట్టాలు ఎందుకు చేశారని ప్రశ్నించారు. చట్టాలు చేసే ముందు రాష్ట్రాల సీఎంలు, వ్యవసాయ శాఖమంత్రులు, రైతులను సంప్రదించలేదని ఆరోపించారు. రైతులను, దళారీలుగా.. ఉగ్రవాదులుగా విమర్శించి ఇప్పుడు వారితో ఎందుకు చర్చలు జరుపుతున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు.

వ్యవసాయ చట్టాల వెనుక అంబానీ, ఆదానీల ఒత్తిడి ఉందని తెలిపారు. రైతుల పోరాటం వల్ల మోదీ దిగివస్తున్నారని పేర్కొన్నారు. వ్యవసాయ చట్టాలు కార్పొరేట్ సంస్థల ప్రయోజనాలకు తప్ప..రైతులకు కాదని అన్నారు. అన్నం తినేవారు అందరూ 26న జరిగే అన్నదాతల ర్యాలీకి మద్దతు ఇవ్వాలని కోరారు.

ఇదీ చదవండి:నేత్రపర్వంగా దేవరాపల్లి సత్యనారాయణ స్వామి జాతర

ABOUT THE AUTHOR

...view details