ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

"అగ్రిగోల్డ్​ బాధితులకు కేటాయింపులు హర్షణీయం" - అగ్రిగోల్డ్

కోట్లాది రూపాయల మోసానికి పాల్పడిన అగ్రిగోల్డ్​ యాజమాన్యాన్ని కఠినంగా శిక్షించాలని సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి డిమాండ్ చేశారు. బాధితుల కోసం బడ్జెట్​లో కేటాయింపులు జరపడాన్ని స్వాగతించారు.

సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పళ్ల నాగేశ్వరరావు

By

Published : Jul 12, 2019, 10:52 PM IST

సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పళ్ల నాగేశ్వరరావు

రాష్ట్రవ్యాప్తంగా 300 మంది ఆత్మహత్యలకు కారణమైన అగ్రిగోల్డ్ యాజమాన్యాన్ని ఉరి తీయాలని సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు విశాఖలో డిమాండ్ చేశారు. వేలాది మంది నుంచి కోట్ల రూపాయలు వసూలు చేసి మోసానికి పాల్పడిన ఇలాంటి సంస్థల యాజమానులను కఠినంగా శిక్షించాలన్నారు. నాలుగున్నరేళ్లుగా తాము చేస్తున్న పోరాటాలకు వైకాపా ప్రభుత్వం మద్దతు ప్రకటించడంపై హర్షం వ్యక్తం చేశారు. బడ్జెట్​లో అగ్రిగోల్డ్ బాధితుల కోసం 1,100 కోట్ల రూపాయలు కేటాయించటంపై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details