ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఎల్​జీ పాలిమర్స్ ఘటనపై సీపీఐ రౌండ్ టేబుల్ సమావేశం - ఎల్​జీ పాలిమర్స్ ఘటనపై విశాఖలో సీపీఐ రౌండ్ టేబుల్ సమావేశం

ఎల్​జీ పాలిమర్స్ ఘటనపై సీపీఐ ఆధ్వర్యంలో విశాఖలోని పార్టీ కార్యాలయంలో వివిధ రాజకీయ పార్టీలు, స్వచ్చంద సంస్థలతో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ప్రభుత్వం బాధిత గ్రామాల విషయంలో మరింత దృష్టి పెట్టాలని సమావేశం అభిప్రాయపడింది.

cpi round table meeting with other parties about vishaka lg polymers incident
ఎల్​జీ పాలిమర్స్ ఘటనపై సీపీఐ రౌండ్ టేబుల్ సమావేశం

By

Published : May 29, 2020, 7:56 PM IST

ఎల్​జీ పాలిమర్స్ ఘటనపై సీపీఐ ఆధ్వర్యంలో విశాఖలోని పార్టీ కార్యాలయంలో వివిధ రాజకీయ పార్టీలతో, స్వచ్చంద సంస్థలతో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ప్రధానంగా ఎల్​జీ పాలీమర్స్ విషయంలో ప్రభుత్వ ఉదాసీనత వల్ల ఎలాంటి రక్షణ చర్యలు లేకుండా... లాక్ డౌన్ తరువాత పరిశ్రమను పునః ప్రారంభించి 13 మందిని బలి తీసుకుందని సమావేశం అభిప్రాయపడింది. పరిసర గ్రామప్రజలు ఆ వాయువు పీల్చి అనారోగ్యానికి గురయ్యారని పలువురు నేతలు ఆవేదన వ్యక్తం చేశారు.

ABOUT THE AUTHOR

...view details