ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

త్వరలోనే రాష్ట్ర వ్యాప్త బంద్​కు పిలుపు: సీపీఐ రామకృష్ణ - విశాఖలో సీపీఐ రామకృష్ణ మీడియా సమావేశం తాజా వివరాలు

ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వకపోగా.. ప్రత్యేక ద్రోహం మాత్రం చేస్తున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు. మోదీ అధికారంలోకి వచ్చిన ఆరున్నర సంవత్సరాల కాలంలో రాష్ట్రానికి ఏ చిన్న ప్రయోజనం చేకూరలేదని విశాఖ సీపీఐ కార్యాలయంలో ఆయన వ్యాఖ్యానించారు. విశాఖ ఉక్కును ప్రైవేట్ పరం చేయాలన్న కేంద్రం నిర్ణయాన్ని అందరూ ముక్త కంఠంతో వ్యతిరేకిస్తున్నారని తెలిపారు.

cpi ramakrishna comments
సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ

By

Published : Feb 18, 2021, 3:04 PM IST

సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై పోరాటంలో భాగంగా.. త్వరలోనే రాష్ట్ర వ్యాప్త బంద్​కు పిలుపునిస్తున్నట్టు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ప్రకటించారు. హైదరాబాద్​లో సంఘీభావ సమావేశం నిర్వహిస్తున్నట్టు చెప్పారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను భాజపా ప్రభుత్వం పాలసీగా పెట్టుకుందని ఆరోపించారు.

దిల్లీకి వెళ్లిన భాజపా నేతలు స్టీల్​ ప్లాంట్​ను రక్షించుకున్నాకే తిరిగి రావాలని డిమాండ్ చేశారు. సీఎం జగన్​ ఉత్తరం రాస్తే సరిపోదని, అఖిలపక్షం ఏర్పాటు చేసి, అదరినీ దిల్లీ తీసుకెళ్లి పోరాటం చేయాలని సూచించారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా రాష్ట్ర అసెంబ్లీలో తీర్మానం చేయాలన్న ఆయన.. ఎంపీలు అంతా కలిసి రాజీనామాలు చేయాలని డిమాండ్ చేశారు.

ABOUT THE AUTHOR

...view details