ఎల్జీ పాలిమర్స్ యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని సీపీఐ నేత కె.రామకృష్ణ అన్నారు. యాజమాన్యంపై 302 కింద కేసుపెట్టి.. అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. గ్యాస్ లీక్ ఘటనకు నిరసనగా నేడు విశాఖ జిల్లా వ్యాప్తంగా నిరసనలు చేపట్టనున్నట్లు కె.రామకృష్ణ తెలిపారు.
'ఎల్జీ పాలిమర్స్ యాజమాన్యాన్ని అరెస్టు చేయాలి'
ఎల్జీ పాలిమర్స్ యాజమాన్యంపై 302 కింద కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని సీపీఐ నేత కె. రామకృష్ణ డిమాండ్ చేశారు. గ్యాస్ లీక్ ఘటనకు నిరసనగా నేడు విశాఖ జిల్లా వ్యాప్తంగా నిరసనలు చేపట్టనున్నట్లు ఆయన తెలిపారు.
ఎల్.జి.పాలిమర్స్ ఘటనపై సీపీఐ నేత రామకృష్ణ
ఎల్జీ పాలిమర్స్ యాజమాన్యానికి పోలీసులు వత్తాసు పలుకుతున్నారని కె.రామకృష్ణ ఆరోపించారు. నిరసనకారులపై పోలీసులు కేసులు నమోదు చేయడం దుర్మార్గమని దుయ్యబట్టారు. రసాయన పరిశ్రమలను జనావాసాలకు దూరంగా తరలించాలని కె.రామకృష్ణ డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి : నేటి నుంచి రైళ్ల సేవలు షురూ.. పూర్తి షెడ్యూల్ ఇదే