ఆంధ్రప్రదేశ్

andhra pradesh

విద్యుత్​ చార్జీలు తగ్గించాలని సీపీఐ నిరసన

By

Published : May 18, 2020, 5:11 PM IST

విశాఖ జిల్లా అనకాపల్లిలో సీపీఐ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. పెంచిన విద్యుత్ చార్జీలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం విద్యుత్ శాఖ డీఈ సత్యనారాయణకు వినతి పత్రం అందజేశారు.

CPI protests to reduce electricity charges
విద్యుత్​ చార్జీలు తగ్గించాలని సీపీఐ నిరసన

అసాధారణంగా పెంచిన విద్యుత్ చార్జీలను రద్దు చేయాలని కోరుతూ సీపీఐ నిరసన కార్యక్రమం చేపట్టింది. విశాఖ జిల్లా అనకాపల్లిలో సీపీఐ ఆధ్వర్యంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

విద్యుత్ శాఖ కార్యాలయం వద్ద ఆందోళన చేసిన నేతలు.. కొత్త టారిఫ్​ను రద్దు చేయాలన్నారు. కేంద్రం విద్యుత్ చట్ట సవరణను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. విద్యుత్ శాఖ డీఈ సత్యనారాయణకు వినతి పత్రం ఇచ్చారు.

ABOUT THE AUTHOR

...view details