ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఛార్జీలు తగ్గించాలంటూ.. బిల్లులు మెడలో వేసుకుని ఆందోళన - విద్యుత్ చార్జీలు తగ్గించాలని వినూత్న నిరసన !

విద్యుత్ చార్జీలు తగ్గించాలని విశాఖపట్నం జిల్లా దేవరాపల్లి విద్యుత్ ఉపకేంద్రం వద్ద వామపక్షాలు నిరసన చేపట్టాయి. బిల్లులను మెడలో దండలా వేసుకొని వినూత్న రీతిలో ఆందోళన చేశారు.

విద్యుత్ చార్జీలు తగ్గించాలని వినూత్న నిరసన !
విద్యుత్ చార్జీలు తగ్గించాలని వినూత్న నిరసన !

By

Published : May 19, 2020, 7:21 AM IST

విశాఖపట్నం జిల్లా దేవరాపల్లి విద్యుత్ ఉపకేంద్రం వద్ద వామపక్షాలు నిరసన చేపట్టాయి. విద్యుత్ చార్జీల మోతతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశాయి. కరోనా కష్టకాలంలో ప్రజలపై విద్యుత్ చార్జీల భారం మోపడం సరైన నిర్ణయం కాదని నేతలు మండిపడ్డారు.

విద్యుత్ బిల్లులను మెడలో దండలా వేసుకొని వినూత్న రీతిలో నిరసన ప్రదర్శన చేశారు. అనంతరం తహసీల్దార్ రమేష్ బాబుకి సీపీఎం నేత రాజు ఆధ్వర్యంలో వినతిపత్రం అందజేశారు. పేదలపై ఛార్జీల రూపంలో మోపిన భారాన్ని తక్షణమే ప్రభుత్వం వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

ABOUT THE AUTHOR

...view details