కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు భారీగా పెంచిన పప్పులు, ఉప్పులు, వంటగ్యాస్, వంటనూనె, కాయగూరల ధరలను అదుపు చేయాలని డిమాండ్ చేస్తూ విశాఖలో సీపీఐ కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. భాజపా ప్రభుత్వం అధికారంలోకి వస్తే వంద రోజుల్లో ప్రజలు వాడే నిత్యవసరాల ధరలు, డీజిల్, పెట్రోల్ ధరలు తగ్గిస్తామని హామీ ఇచ్చారని.. అధికారంలోకి వచ్చి 78 నెలలు గడిచినా పేద మధ్య తరగతి ప్రజలు వాడే నిత్యావసర వస్తువుల ధరలను అదుపు చేయడం లేదని అన్నారు.
నిత్యావసరాల ధరలను అదుపు చేయాలని సీపీఐ ధర్నా - విశాఖలో సీపీఐ ధర్నా వార్తలు
ప్రజలకి ఆదాయ వనరులు చూపించలేని ప్రభుత్వానికి ధరల పెంచే అధికారం ఎవరిచ్చారని సీపీఐ నేతలు ప్రశ్నించారు. పెరుగుతున్న నిత్యావసరాల ధరలతో ప్రజలు కుదేలవుతున్నారని మండిపడ్డారు. ధరలను అదుపు చేయడంలో మోదీ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందన్నారు.
CPI Agitation
కేంద్ర ప్రభుత్వ తీరును నిరసిస్తూ సీతమ్మధార రైతు బజార్ జంక్షన్లో సీపీఐ కార్యకర్తలు నిరసన తెలిపారు. ఇప్పటికైనా భారీగా పెంచిన నిత్యావసరాల ధరలను నియంత్రించి ప్రజలకు ఆహార భద్రత కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అడ్డు అదుపు లేకుండా పెరిగిన పెట్రో, డీజిల్ ధరలను జీఎస్టీ పరిధిలోకి తేవాలని.. సెస్, వ్యాట్ పన్నులను రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి:ఇడుపులపాయలో విద్యార్థుల మధ్య ఘర్షణ..