సీఎం జగన్కు చిత్తశుద్ధి ఉంటే ఎన్ఆర్సీకి వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం చేయాలని సీపీఐ జాతీయ కమిటీ కార్యదర్శి డాక్టర్ నారాయణ డిమాండ్ చేశారు. విశాఖ జిల్లా నర్సీపట్నంలోని ప్రాంతీయ పార్టీ కార్యాలయం నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ఆయన... అనంతరం బహిరంగ సమావేశంలో మాట్లాడారు. వైకాపా ప్రభుత్వం రాష్ట్రంలో ఓ మాట దిల్లీలో మరో మాట చెబుతోందని విమర్శించారు. మైనార్టీలకు తమ ప్రభుత్వం అండగా ఉంటుందని జగన్ చెబుతూనే... పౌరసత్వ సవరణ చట్టానికి వైకాపా ఎంపీలతో మద్దతు తెలిపారని అన్నారు. రాజధాని విషయంలోనూ తప్పుడు నిర్ణయాలు తీసుకుంటున్నారని అన్నారు. ఇదంతా తుగ్గక్ పాలనలా ఉందని మండిపడ్డారు. మరోవైపు కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన పౌరసత్వ సవరణ చట్టం, జాతీయ పౌర పట్టికలను ఆయన తప్పుబట్టారు. అలాగే లాభాలను అర్జిస్తోన్న ఎల్ఐసీ సంస్థ ప్రైవేటీకరణకు యత్నిస్తుండడం దుర్మార్గమని నారాయణ దుయ్యబట్టారు.
'సీఎం జగన్కు చిత్తశుద్ధి ఉంటే ఎన్ఆర్సీపై తీర్మానం చేయాలి' - సీఎం జగన్ వార్తలు
కేంద్ర ప్రభుత్వ చట్టాలపై వైకాపా ప్రభుత్వం రాష్ట్రంలో ఓ మాట.. దిల్లీలో మరో మాట చెబుతోందని సీపీఐ నేత నారాయణ విమర్శించారు. మైనార్టీలకు తమ ప్రభుత్వం అండగా ఉంటుందని జగన్ చెబుతూనే... పౌరసత్వ సవరణ చట్టానికి వైకాపా ఎంపీలతో మద్దతు తెలిపారని అన్నారు.
CPI Narayana