సీపీఐ మావోయిస్టు పార్టీ ఏవోబీలోని ఈస్ట్ - మల్కన్ గిరి డివిజన్ కార్యదర్శి అరుణ మీడియాకు విడుదల చేసిన అడియో ఇంటర్వ్యూలో పలు అంశాలపై పార్టీ వైఖరిని వెల్లడించారు. మన్యంలో బాక్సైట్ తవ్వకాలను నిలుపుదల చేసే జీవో నెంబర్ 97 రద్దు వల్ల మన్యం ప్రజలంతా సీఎం జగన్‌కు రుణపడి ఉండాలని ఆపార్టీ నేతలు విజయోత్సవ సభలు జరిపారు. ఈ సభలు సరికాదని, దీనిని వ్యతిరేకిస్తున్నామని మావోయిస్టు పార్టీ వ్యాఖ్యానించింది. ఈ జీవో రద్దు వెనుక గిరిపుత్రుల వీరోచిత పోరాటాల చరిత్ర ఉందని, ఇది వారి త్యాగాల ఫలితమేనని తెలిపింది. ప్రభుత్వం ఏదైనా సరే అదివాసీల మనోభావాల పట్ల ప్రేమ గౌరవం లేవని వివరించింది. బాక్సైట్ సమస్య అదివాసీల భూమి సమస్య అని, నాటి సీతారామరాజు పోరాటం నుంచి నేటి మావోయిస్టు పార్టీ సాయుధ పోరాటం వరకు ప్రతి అంశంలోనూ ఆదివాసీలు భాగస్వాములవుతున్నారన్నారు. అప్పుడు చంద్రబాబు పోలీసులను పెట్టైనా సరే బాక్సైట్ తవ్వకాలు చేస్తాననన్నారని, ఎన్నికల ముందు అప్పుడే గిరిపుత్రులు గుర్తోచ్చినట్టుగా బాక్సైట్ తవ్వకాలు అనుమతులు రద్దు చేస్తానని ప్రకటించారని విమర్శించారు. జగన్ అంతకంటే తెలివిగా తన మనుగడ కోసం 97 జీవోను రద్దు చేసి గిరిపుత్రులపై ప్రేమ ఉన్నట్టు చెబుతున్నారని.. మావోయిస్టు ఉద్యమాన్ని అణిచివేయడమే దీని వెనుక ఉన్న ఆంతర్యమని అరుణ అభిప్రాయపడ్డారు. ప్రజల డబ్బుతో జగన్ చిత్రపటాలకు క్షీరాభిషేకాలు చేయడమేంటని ప్రశ్నించారు.
'గిరిపుత్రుల త్యాగాల ఫలితమే జీవో 97 రద్దు' - సీపీఐ మావోయిస్టు పార్టీ ఎవోబిలోని ఈస్ట్ - మల్కన్ గిరి డివిజన్ కార్యదర్శి మీడియాకు అడియో
సీపీఐ మావోయిస్టు పార్టీ ఏవోబీలోని ఈస్ట్ - మల్కన్‌గిరి డివిజన్ కార్యదర్శి మీడియాకు విడుదల చేసిన అడియో ఇంటర్వ్యూలో పలు అంశాలపై పార్టీ వైఖరి వెల్లడించారు. జీవో 97 రద్దు వెనుక గిరిపుత్రుల త్యాగాలు ఉన్నాయనయి అభిప్రాయపడ్డారు.
CPI Maoist Party Secretary of East - Malkan Giri Division