విశాఖ జిల్లా అనకాపల్లిలోని సీపీఐ కార్యాలయం వద్ద సామాజిక దూరం పాటిస్తూ.. పార్టీ నాయకులు మౌనదీక్ష చేపట్టారు. కార్మికులు, రైతులను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని నేతలు వై.ఎన్. భద్రం, కోన లక్ష్మణ్.. దీక్ష అనంతరం విమర్శించారు.
50 మంది బడా బాబులు తీసుకున్న 69 వేల కోట్ల రుణాన్ని ఒక్క కలం పోటుతో రద్దు చేశారని ఆగ్రహించారు. అలాంటి కేంద్ర ప్రభుత్వం రైతులు, కార్మికులను కనీసం పట్టించుకోవడం లేదని అన్నారు. ఇప్పటికైనా తీరు మారాలన్నారు.