విశాఖ ఉక్కు(Visakhapatnam steel plant) ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జిల్లాలోని గాజువాకలో సీపీఐ నేతలు(cpi leaders) పాదయాత్ర చేశారు. రాష్ట్రంలో పెంచిన విద్యుత్ చార్జీలను, మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. విశాఖలోని జింక్ గేట్ నుంచి కూర్మన్నపాలెం జంక్షన్ వరకు 8 కిలోమీటర్లు పాదయాత్ర చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఐ రాజ్యసభ సభ్యుడు, జాతీయ కార్యదర్శి బినోయ్ విశ్వం, జాతీయ కార్యదర్శి కె. నారాయణ, రాష్ట్ర కార్యదర్శి కె. రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
CPI:విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సీపీఐ పాదయాత్ర - విశాఖ జిల్లా వార్తలు
విశాఖ ఉక్కు (Visakhapatnam steel plant) ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సీపీఐ ఆధ్వర్యంలో గాజువాకలో పాదయాత్ర చేపట్టారు. అలాగే పెంచిన విద్యుత్ ఛార్జీలను, మూడు వ్యవసాయ చట్టాలు రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ ర్యాలీలో సీపీఐ ముఖ్య నేతలు పాల్గొన్నారు.
సీపీఐ పాదయాత్ర