'ఉత్తరాంధ్రలో భూములు అమ్మి కోస్తాంధ్రాలో పెడితో ఊరుకోం' రాష్ట్ర ప్రభుత్వ పనితీరుపై సీపీఐ సీనియర్ నేత జేవీ సత్యనారాయణ మూర్తి మండిపడ్డారు. ఉత్తరాంధ్రలోని విలువైన భూమూలను అమ్మి... కోస్తా, రాయలసీమను అభివృద్ధి చేయాలనుకుంటున్నారని ఆరోపించారు. విశాఖలోని పార్టీ కార్యాలయంలో మాట్లాడిన ఆయన... ఎస్ఈ జెడ్ల పేరుతో వేల ఎకరాల ప్రభుత్వ భూములను పారిశ్రామికవేత్తలకు దారాదత్తం చేసిందన్నారు. పరిశ్రమల పేరుతో భూములు తీసుకొని... ఎలాంటి పరిశ్రమలు స్థాపించని వారినుంచి భూములు స్వాధీనం చేసుకోవాలని కోరారు. అభివృద్ధి పేరుతో ప్రభుత్వ భూములు అమ్మే కార్యక్రమాన్ని ప్రభుత్వం విరమించుకోవాలని... లేని పక్షంలో అన్ని పార్టీలను కలుపుకుని ప్రజాఉద్యమం చేస్తామని హెచ్చరించారు.
ఇదీ చూడండి