టిడ్కో ఇళ్లు మంజూరు చేయాలని సిపిఐ ధర్నా - టిడ్కో ఇళ్లు మంజూరు చేయాలని సిపిఐ ధర్నా
ఏపీ టిడ్కో ఇళ్లకు డబ్బులు కట్టించుకుని ఎంపిక చేసిన అర్హులందరికీ ఇళ్లు మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ భారత కమ్యూనిస్టు పార్టీ విశాఖలో ఆందోళన చేపట్టింది.
ఏపీ టిడ్కో ఇళ్లకు డబ్బులు కట్టించుకుని ఎంపిక చేసిన అర్హులందరికీ ఇళ్లు మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ భారత కమ్యూనిస్టు పార్టీ విశాఖలో ఆందోళన చేపట్టింది. సొంతిల్లు సమకూరుతుందనే ఆశతో లక్షల్లో అప్పులు చేసిన లబ్ధిదారులు.. ఇల్లు మంజూరు చేయక లబోదిబోమంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ తీరును నిరసిస్తూ విశాఖలోని జీవీఎంసీ గాంధీ పార్క్ లో నిరసన ప్రదర్శన నిర్వహించింది. రివర్స్ టెండరింగ్ పేరుతో గత 16 నెలలుగా టిడ్కో ఇళ్లకు మెరుగులు దిద్దకుండా ప్రభుత్వం తాత్సారం చేయడాన్ని సిపిఐ నాయకులు తప్పుబట్టారు. డబ్బులు కట్టించుకున్న అర్హులందరికీ వెంటనే ఇళ్లు మంజూరు చేసే వరకు ఆందోళనలను కొనసాగిస్తామని హెచ్చరించారు.
ఇవీ చదవండి: కొళాయిల నుంచి మురికి నీళ్లు.. ఇబ్బందులు పడుతున్న ప్రజలు