విశాఖ జిల్లా అనకాపల్లి లో సీపీఐ నాయకులు, కార్యకర్తలు మౌన దీక్ష చేపట్టారు. ఆర్ఆర్ వెంకటాపురంలోని ఎల్జీ పాలిమర్స్ యాజమాన్యంపై ఐపీసీ 302 సెక్షన్ కింద కేసు నమోదు చేసి తక్షణమే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. జనావాసాల మధ్య ఉన్న పరిశ్రమను తొలగించాలని డిమాండ్ చేశారు.
ప్రజల ప్రాణాలను తీసిన ఎల్జీ పాలిమర్స్ యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ ఆర్డిఓ సీతారామారావుకు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు వై. ఎన్ భద్రం, కొన లక్ష్మణ్ పాల్గొన్నారు.