లాక్డౌన్ కారణంగా లోడింగ్, అన్ లోడింగ్ పనులు నిలిచిపోయి, కార్మికుల కుటుంబాలు దిక్కుతోచని స్థితిలో ఉన్నాయని, వారికి మూడు నెలల నిత్యావసరాలు, గ్యాస్ సిలిండర్ సరఫరా చేయాలని సీపీఐ జిల్లా ప్రధాన కార్యదర్శి వామనమూర్తి డిమాండ్ చేశారు. విశాఖ సీతమ్మధార కూడలిలో సీపీఐ అనుబంధ సంఘం ఏఐటీయూసీ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. ఇతర కార్మికులకు అందించే విధంగా హమాలీ, ముఠా కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక సాయం చేయకుంటే, వారి కుటుంబాలు రోడ్డున పడే ప్రమాదం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో రవి కృష్ణ, వై .లక్ష్మణరావు, ఆదినారాయణ, కే .అప్పల రాజు పాల్గొన్నారు.
హమాలీ, ముఠా కార్మికులను ఆదుకోవాలని సీపీఐ ధర్నా - హమాలీలపై లాక్డౌన్ ప్రభావం వార్తలు
లాక్డౌన్ కారణంగా ఉపాధి కోల్పోయిన హమాలీ, ముఠా కార్మికులను ప్రభుత్వం ఆదుకోవాలని సీపీఐ అనుబంధ సంఘం ఏఐటీయూసీ నిరసన చేపట్టింది. విశాఖ సీతమ్మధార కూడలిలో ధర్నా చేపట్టారు. హమాలీ, ముఠా కార్మికులకు ఒక్కొక్కరికి రూ. 10వేల ఇచ్చి ఆదుకోవాలని జిల్లా ప్రధాన కార్యదర్శి వామనమూర్తి కోరారు.
హమాలి, ముఠా కార్మికులను ఆదుకోవాలని సీపీఐ ధర్నా