విశాఖ ఉక్కు కర్మాగారాన్ని వంద శాతం ప్రైవేటుపరం చేస్తామన్న కేంద్ర ఆర్థిక మంత్రి ప్రకటనకు నిరసనగా... విశాఖలోని సీపీఐ నేతలు నిరసనకు దిగారు. రాస్తారోకోకు పిలుపునిచ్చిన సీపీఐ నేతలు.. నగరంలోని అల్లిపురం కూడలి వద్ద ఆందోళన చేశారు. రాష్ట్రంలో ప్రభుత్వ రంగ సంస్థలను.. కేంద్రం ప్రైవేటు పరం చేస్తుంటే.. అధికార, ప్రతిపక్ష పార్టీలు వ్యతిరేకించటంలో విఫలమయ్యాయని ధ్వజమెత్తారు. ఈ సందర్భంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. జనసేన పార్టీ భాజపా నిర్ణయాలకు అనుకూలంగా వ్యవహరిస్తూ.. తెలుగు వారి ఆత్మగౌరవాన్ని మంట కలుపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
రాష్ట్రంలో అధికార, ప్రతిపక్ష పార్టీలు విఫలమయ్యాయి: సీపీఐ - cpi rastha roko in vizag news
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరించటం దారుణమైన నిర్ణయమని సీపీఐ నాయకులు అన్నారు. విశాఖలో సీసీఐ రాస్తారోకో నిర్వహించింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నినాదాలు చేసిన నాయకులు.. ప్రభుత్వాల తీరుపై మండిపడ్డారు.
![రాష్ట్రంలో అధికార, ప్రతిపక్ష పార్టీలు విఫలమయ్యాయి: సీపీఐ cpi agitation for vizag steel plant](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10943119-650-10943119-1615340771517.jpg)
సీపీఐ రాస్తారోకో