భారత కమ్యూనిస్టు పార్టీ 94వ వార్షికోత్సవం సందర్భంగా విశాఖపట్నంలోని సుజాతనగర్లో ఏర్పాటు చేసిన బహిరంగకు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. 94 ఏళ్లుగా కార్మికులకు, బడుగు బలహీన వర్గాల వారికి సీపీఐ అండగా నిలిచిందని అన్నారు. దున్నేవాడిదే భూమి పోరాటంలో అనేక మంది కామ్రేడ్స్ రక్తం దార పోశారని ఆయన గుర్తు చేశారు. కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోదీ, అమిత్షా.... పేద ప్రజలను పట్టించుకోకుండా కార్పొరేట్ సంస్థలకు ఊడిగం చేస్తున్నారని మండిపడ్డారు. అలాగే రాష్ట్ర సమగ్ర అభివృద్ధి కోసం అన్ని జిల్లాల నుంచి నివేదికలు కోరామన్నారు. మూడు రాజధానుల విషయంలో ముఖ్యమంత్రి జగన్ అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసిన అనంతరం తమ నిర్ణయాన్ని తెలియపరుస్తామని అన్నారు.
'పేద వారికి సీపీఐ అండగా నిలుస్తోంది' - cpi 94th anniversary meeting news in visakhapatnam
భారత కమ్యూనిస్టు పార్టీ 94వ వార్షికోత్సవం సందర్భంగా విశాఖపట్నంలోని సుజాతనగర్లో బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ... దున్నేవాడిదే భూమి పోరాటంలో అనేకమంది కామ్రేడ్స్ రక్తం దార పోశారని గుర్తు చేశారు.
భారత కమ్యూనిస్టు పార్టీ 94వ వార్షికోత్సవ సమావేశం