ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అకారణంగా బయటకొస్తే కఠిన చర్యలు తప్పవు: సీపీ - Visakha cp examining curfew

విశాఖలో కర్ఫ్యూ అమలు తీరును నగర పోలీస్ కమిషనర్ మనీష్ కుమార్ సిన్హా పర్యవేక్షించారు. అకారణంగా బయటకొస్తే కఠిన చర్యలుంటాయని హెచ్చరించారు.

cp Manish Kumar Sinha examining curfew
cp Manish Kumar Sinha examining curfew

By

Published : May 16, 2021, 8:02 PM IST

కర్ఫ్యూ నిబంధనలు అతిక్రమించేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని విశాఖ నగర పోలీస్ కమిషనర్ మనీష్ కుమార్ సిన్హా హెచ్చరించారు. నగరంలో కర్ఫ్యూ అమలు తీరును ఆయన పర్యవేక్షించారు. సాయంత్రం వేళల్లో చిన్నచిన్న కారణాలు చెప్పి బయటకు వచ్చే వారి సంఖ్య ఎక్కువగా ఉండటంతో బీచ్ రోడ్, తెన్నేటి పార్కు పరిసరాల్లో పోలీసుల పనితీరును సీపీ నేరుగా పరిశీలించారు. అటువైపుగా వస్తున్న వాహనదారులను ఆపి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అకారణంగా ఎవరూ బయటకు రావొద్దని.. ప్రభుత్వ ఆదేశాలు అతిక్రమిస్తే కఠిన చర్యలుంటాయని హెచ్చరించారు.

ABOUT THE AUTHOR

...view details