సింహాచలం పాత గోశాలలో గోవులు కనిపించడం లేదు. నిన్నటి వరకు అనేక లేగ దూడలతో ఉన్న గోశాల ఉదయానికి పూర్తిగా ఖాళీ అయింది. సుమారు 85కు పైగా లేగ దూడలను రాత్రికి రాత్రి తరలించినట్లు తెలుస్తోంది.
లేగ దూడలను ఎటు తీసుకువెళ్లారనే విషయంపై ఇప్పటి వరకు స్పష్టత లేదు. గత కొద్ది రోజులగా గోశాలలో లేగదూడలు, పెయ్యలు చనిపోతున్నాయి. అనారోగ్యంతో బాధ పడుతున్న మూగజీవాలను తరలించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.