ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

జీతాలు చెల్లించాలంటూ కొవిడ్ సిబ్బంది బిక్షాటన - విశాఖ జిల్లా తాజా వార్తలు

విశాఖపట్నం జిల్లా పాడేరులో కొవిడ్ సిబ్బంది బిక్షాటన చేశారు. కరోనా కాలంలో అహర్నిశలు కష్టపడి పనిచేసిన తమకు జీతాలు చెల్లించాలని డిమాండ్ చేశారు.

జీతాలు చెల్లించాలంటూ కొవిడ్ సిబ్బంది బిక్షాటన
జీతాలు చెల్లించాలంటూ కొవిడ్ సిబ్బంది బిక్షాటన

By

Published : Dec 23, 2020, 6:06 PM IST

కరోనా కాలంలో అహర్నిశలు కష్టపడి పనిచేసిన తమకు జీతాలు ఇవ్వకపోగా ఉద్యోగ భద్రత కూడా కల్పించడం లేదని కొవిడ్ సిబ్బంది పేర్కొన్నారు. ఈ మేరకు విశాఖపట్నం జిల్లా పాడేరులో భిక్షాటన చేపట్టారు. పాడేరు ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి సినిమా హాల్ సెంటర్ వరకు ప్రతి దుకాణం వద్ద బిక్షాటన చేస్తూ... ప్రభుత్వం తమకు న్యాయం చేయాలంటూ నినాదాలు చేశారు.

కొవిడ్ విపత్కర పరిస్థితుల్లో విధులు నిర్వర్తించిన తమకు ఇప్పటికి జీతాలు చెల్లించలేదని కొవిడ్ వారియర్స్ హక్కుల సమితి అధ్యక్షులు అమర్ అన్నారు. జీతాలు చెల్లించి, ఉద్యోగ భద్రత కల్పించి తమను ఆదుకోవాలని కోరారు.

ABOUT THE AUTHOR

...view details