ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఎన్నికల సిబ్భందికి... కొవిడ్ వ్యాప్తి నివారణ కిట్లు! - ఏపీ తాజా వార్తలు

విశాఖలో పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతుంది. ఎన్నికల్లో పనిచేసే అధికారులకు కరోనా వ్యాప్తి చెందకుండా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోనున్నారు. సిబ్బందికి కొవిడ్ వ్యాప్తి నివారణ కిట్లను అందించనున్నారు.

covid Spread
covid Spread

By

Published : Jan 30, 2021, 10:00 AM IST

విశాఖలో మొదటి దశ పంచాయతి ఎన్నికల కోలాహలం మొదలైంది. అనకాపల్లిలో 340 డివిజన్లకు ఎన్నికలు జరగనున్నాయి. 3,286 వార్డులు ఎన్నికలకు సిద్ధంగా ఉన్నాయి. మొదటి దశలో 5,97,763 ఓటర్లు ఉండగా.. వారిలో పురుషుల సంఖ్య 2,92,654 , స్త్రీలు 3,05,085 గా ఉన్నారు. ఇతరులు 24 మంది ఓటర్లు ఉన్నారు.

మొదటి దశ ఫేస్ -1 రిటర్నింగ్ అధికారులు 120 , సహాయ రిటర్నింగ్ అధికారులు 120 మంది ఉంటారు. మొదటి దశ ఫేస్ 2కు 375 మంది రిటర్నింగ్ అధికారులు ఉంటారు. ఇక నేరుగా పోలింగ్ అధికారులు 3,636.. సహాయ పోలింగ్ అధికారులు 4,702 మంది ఎన్నికల విధుల్లో పాల్గొంటారు. అయితే ఎన్నికల విధుల్లో పాల్గొనే సిబ్బంది కొవిడ్ నిబంధనలు పాటించాల్సి ఉంటుంది. జిల్లా అధికారులు, ఎన్నికల విధుల్లో ఉండే వారికి కొవిడ్ వ్యాప్తి నివారణ కిట్లు ఇస్తున్నారు. దీనికి వైద్య శాఖ సహకారం అందిస్తోంది. ప్రతీ దశలో సుమారు 11 వేల మంది ఎన్నికలకు పనిచేయనున్నారు.

ABOUT THE AUTHOR

...view details