విశాఖ జిల్లా గ్రామీణ ప్రాంతాలకు కరోనా వైరస్ వ్యాప్తిచెందుతోంది. విస్తర్ల తయారీ పరిశ్రమగా గుర్తింపు పొందిన రావికమతం మండలం కొత్తకోటలో పాజిటివ్ కేసులు సంఖ్య పెరుగుతోంది. స్థానిక ఎస్సీ కాలనీకి చెందిన ఓ యువకుడికి పాజిటివ్ నిర్ధారణ కాగా గ్రామంలో మరో ఇద్దరు వ్యక్తులకు కరోనా పాజిటివ్ గుర్తించారు.
గ్రామీణ ప్రాంతాల్లో పెరుగుతున్న పాజిటివ్ కేసులు - covid cases in viskaha rural
విశాఖ జిల్లా గ్రామీణ ప్రాంతాల్లో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతుండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. రావికమతం మండలం కోత్తకోటలో మూడు కరోనా పాజిటివ్ కేసులు నమోదవటంతో వ్యాపార వాణిజ్య సంస్థలకు సమయాన్ని కుదిస్తూ కొత్తకోట సీఐ లక్ష్మణమూర్తి ఆదేశాలు జారీచేశారు.
![గ్రామీణ ప్రాంతాల్లో పెరుగుతున్న పాజిటివ్ కేసులు covid positve cases increasing in visakha dst rual areas](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7996635-976-7996635-1594552932987.jpg)
covid positve cases increasing in visakha dst rual areas
పోలీసులు ఎక్కడికక్కడ బారికేడ్లను ఏర్పాటు చేసి రహదారులను మూసివేశారు. జన సంచారం లేకుండా పోలీసులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. గ్రామంలోని వ్యాపార వాణిజ్య సంస్థలకు సమయాన్ని కుదించారు. ఈ మేరకు కొత్తకోట సీఐ లక్ష్మణమూర్తి ఆదేశాలు జారీ చేశారు.
ఇదీ చూడండి