ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

నర్సీపట్నంలో పెరుగుతున్న కరోనా కేసులు - నర్సీపట్నం కరోనా కేసులు

విశాఖ జిల్లా నర్సీపట్నంలో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. పరీక్షల కోసం ప్రాంతీయ ఆసుపత్రికి వచ్చే వారి సంఖ్య అధికమవుతుండటంతో అధికారులు ఆంక్షలు విధించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో నమూనాలు సేకరించి వాటిని నర్సీపట్నం ప్రాంతీయ ఆసుపత్రికి తీసుకు రావాలని వైద్య బృందం నిర్ణయించింది.

covid positive cases increasing in narsipatnam at vizag
covid positive cases increasing in narsipatnam at vizag

By

Published : Jul 16, 2020, 10:36 AM IST

విశాఖ జిల్లా నర్సీపట్నం ప్రాంతీయ ఆసుపత్రి వద్ద కరోనా వైద్య పరీక్షల కోసం వచ్చే రోగుల సంఖ్య అధికమవుతోంది. నర్సీపట్నం ఆసుపత్రి వద్ద షరతులు విధించారు. ఇకపై కరోనా వైద్య పరీక్షలకు వచ్చే రోగుల నమూనాలను ఆయా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో సేకరించి వాటిని నర్సీపట్నం ప్రాంతీయ ఆసుపత్రికి తీసుకు రావాలని వైద్య బృందం నిర్ణయించింది. అధికారులు కూడా చర్యలు చేపట్టారు.

నర్సీపట్నం శారదానగర్ పరిధిలో ఒక్క రోజే పది పాజిటివ్ కేసులు రావటంతో ఆ ప్రాంతాన్ని అప్రమత్తం చేశారు. ప్రధానంగా ఇక్కడి వాలంటీర్​తో పాటు మరో తొమ్మిది మందికి పాజిటివ్ వచ్చినట్లు గుర్తించారు. శారద నగర్​లోని సచివాలయాన్ని తాత్కాలికంగా మూసివేశారు.

ABOUT THE AUTHOR

...view details