కొవిడ్ మహమ్మారి గతేడాది కంటే వేగంగా విజృంభిస్తోంది. రోజురోజుకూ కేసుల సంఖ్య పెరుగుతుండగా.. అత్యవసర స్థితిలో చికిత్స పొందుతున్నవారూ ఎక్కువగానే ఉన్నారు. కొవిడ్ బాధితులు.. మానసికంగా కుంగిపోవడం వల్లే బలవన్మరణాలకు పాల్పడుతున్నారని వైద్యులు అభిప్రాయపడుతున్నారు. ఇటీవలే విశాఖ కేజీహెచ్‌లో ఓ మహిళ భవనంపై నుంచి దూకి చనిపోవటం కలిచి వేసిందని వైద్యులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలంతా కరోనాపై అవగాహనతో మెలగాలని సూచిస్తున్నారు. వైరస్ సోకినా తగిన జాగ్రత్తలు తీసుకుంటే కోలుకోవచ్చని చెబుతున్నారు.
కరోనా సోకిన వారితో కుటుంబ సభ్యులు, స్నేహితులు సానుకూలంగా ప్రవర్తించి.. వారికి అండగా నిలవాలని వైద్యులు సూచిస్తున్నారు. మనో ధైర్యంతో ఉంటే వ్యాధిని జయించవచ్చని మానసిక వైద్య నిపుణులు చెబుతున్నారు.