ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

విశాఖలో వైద్య దంపతులకు ఆత్మీయ స్వాగతం - విశాఖ వార్తలు

విశాఖలో కరోనా బాధితులకు వైద్యం అందించి.. వారిని కోలుకునేలా చేసి.. ఇంటికి తిరిగి వచ్చిన వైద్య దంపతులు అయ్యప్ప, ఉషలకు వారి అపార్ట్​మెంట్ వాసులు ఘన స్వాగతం పలికారు. నిత్యం ప్రజల బాగు కోసం పాటు పడే వైద్యుల సేవలు అభినందనీయమన్నారు.

Covid Doctor grand Welcome in visakha
విశాఖలో వైద్య దంపతులకు ఆత్మీయ స్వాగతం

By

Published : May 6, 2020, 1:32 PM IST

విశాఖలో కరోనా బాధితులకు వైద్యం అందించి... దాదాపు 40 రోజుల తరువాత నివాసానికి వచ్చిన వైద్యులు అయ్యప్పకు అపార్ట్​మెంట్ వాసులు ఘనంగా స్వాగతం పలికారు. విశాఖలో తొలి కరోనా భాధితునికి వైద్యం చేసి.... అనంతరం వచ్చిన పాజిటివ్ కేసులకు కూడా వైద్యం అందించి... వారు త్వరగా కోలుకునేలా చేశారు. వైద్యుడు అయ్యప్ప తమ నివాస సముదాయంలో ఉన్నందుకు తాము ఎంతో గర్వపడుతున్నామని అపార్ట్​మెంట్ వాసులు తెలిపారు.

విశాఖలో ఇసుకతోట వద్ద ఉన్న ఎస్ ఆర్ ఎలిగెన్స్ అపార్ట్​మెంట్లో వైద్యుడు అయ్యప్ప నివాసముంటున్నారు. ఆయన చెస్ట్ ఫిజీషియన్​గా, కోవిడ్ నోడల్ అధికారిగా సేవలు అందిస్తున్నారు. ఈయన భార్య డాక్టర్ ఉష అగనంపూడి ఆసుపత్రిలో సివిల్ సర్జన్ సేవలు అందిస్తున్నారు. ఈ దంపతులిద్దరిని అపార్ట్​మెంట్ వాసులు పూలు చల్లి స్వాగతం పలికారు. ప్రొఫెసర్ శశి భూషణరావు.. వారి సేవలను కొనియాడారు.

ABOUT THE AUTHOR

...view details