విశాఖ జిల్లాలో దాదాపు రెండు నుంచి మూడు నెలలుగా కొవిడ్ క్లస్టర్లుగా ఆంక్షలతో ఉన్న కొన్ని ప్రాంతాలకు విముక్తి లభించింది. మూడు వారాలుగా కొత్త కేసు నమోదు కాకపోవడం, పాత కేసులన్నీ దాదాపుగా రికవరీ కావడం వల్ల వీటిని కొవిడ్ క్లస్టర్లుగా తొలగించారు. నిన్నటి వరకు కేవలం 39 మాత్రమే డీనోటిఫై క్లస్టర్లుగా ఉన్నాయి. ఇవాళ వాటి సంఖ్య 171కి చేరింది.
పలు ప్రాంతాల్లో కొవిడ్ క్లస్టర్లు తొలగింపు - విశాఖపట్నంలో కరోనా కేసులు
విశాఖ జిల్లాలో కరోనా కేసులు అదుపులో ఉన్న ప్రాంతాల్లో కొవిడ్ క్లస్టర్లు తొలగించారు. మూడు వారాలుగా కొత్త కేసు నమోదు కాకపోవడం, పాత కేసులన్నీ దాదాపుగా రికవరీ కావడం వల్ల వీటిని కొవిడ్ క్లస్టర్లుగా తొలగిస్తూ నిర్ణయం తీసుకున్నారు.
పలు ప్రాంతాల్లో కోవిడ్ క్లస్టర్లు తొలగింపు
తాజాగా డీ నోటిఫై చేసిన క్లస్టర్ల వివరాలను కొవిడ్ సమన్వయకర్త డాక్టర్ పీవీ సుధాకర్ ప్రకటించారు. వెరీ యాక్టివ్ క్లస్టర్ల సంఖ్య 66కి పరిమితమైంది. యాక్టివ్ క్లస్టర్ల సంఖ్య 255గా ఉంది. డోర్నమెంట్ క్లస్టర్ల సంఖ్య 415 గా ప్రకటించారు. డీ నోటిఫైడ్ క్లస్టర్లలో లాక్ డౌన్ ఆంక్షల సడలించి, బారికేడ్లు తొలగించారు.
ఇదీ చదవండి: అమరావతిపై రాష్ట్ర ప్రజల్లో చైతన్యం రావాలి: చంద్రబాబు