విశాఖ జిల్లాలో ప్రతి నియోజకవర్గ పరిధిలో కోవిడ్ కేర్ సెంటర్ల ఏర్పాటుకు అనువైన కేంద్రాలు పరిశీలించాలని అధికారులను కలెక్టర్ వి. వినయ్ చంద్ ఆదేశించారు. మంగళవారం సాయంత్రానికల్లా నివేదిక ఇవ్వాలన్నారు. కలెక్టర్ కార్యాలయంలో రెవెన్యూ, వైద్య అధికారులులతో పలు కరోనా చికిత్స కేంద్రాలపై సమీక్ష నిర్వహించారు.
ప్రతి నియోజకవర్గంలో కోవిడ్ కేంద్రం - covid centres at vishakapatnam
ప్రతి నియోజకవర్గ పరిధిలో కోవిడ్ కేర్ సెంటర్ల ఏర్పాటుకు అనువైన కేంద్రాలు పరిశీలించాలని విశాఖ జిల్లా కలెక్టర్ వినయ్ చంద్ అధికారులకు సూచించారు. ఈ సాయంత్రానికల్లా నివేదిక ఇవ్వాలని ఆదేశించారు.
కోవిడ్ కేర్ సెంటర్ల పర్యవేక్షణ బాధ్యత రెవెన్యూ డివిజన్ అధికారుల దేనని కలెక్టర్ అన్నారు. నియోజకవర్గ కోవిడ్ కేర్ సెంటర్ కు ప్రత్యేక స్పెషలాఫీసర్ ను నియమించడం జరుగుతుందన్నారు. ప్రతీ కోవిడ్ కేర్ సెంటర్ లో 300 పడకలకు తక్కువ కాకుండా చూడాలన్నారు. బాధితులకు మెనూ ప్రకారం మంచి నాణ్యమైన భోజనం, తాగు నీరు, బెడ్స్, ఫ్యాన్స్, లైట్స్, శానిటేషన్, టాయిలెట్స్ తదితర కనీస సౌకర్యాలను ఏర్పాటు చేయాలన్నారు.
ఇదీ చదవండి: సీఎం జగన్కు ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ లేఖ...ఎందుకంటే ?