ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

విశాఖలో మహిళా కానిస్టేబుల్​కు కరోనా పాజిటివ్​ - ఈటీవీ భారత్​ తాజా వార్తలు

రాష్ట్రంలో కరోనా మహమ్మారి విపరీతంగా వ్యాపిస్తోంది. విశాఖపట్నం జిల్లా మాడుగుల నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో వైరస్​ కేసులు పెరుగుతుండటంతో ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. తాజాగా సూదువలస గ్రామానికి చెందిన మహిళా కానిస్టేబుల్​కు కరోనా పాజిటివ్​ రాగా... అధికారులు ఆయా గ్రామాల్లో పర్యటించి, పారిశుద్ధ్య పనులు చేయించి, కంటైన్​మెంట్లు జోన్లను ఏర్పాటు చేశారు. మహమ్మారి బారినపడకుండా ప్రజలకు తగు సూచనలిచ్చారు.

covid cases hikes at visakha
విశాఖలో పెరుగుతున్న కరోనా ఉధృతి

By

Published : Jul 12, 2020, 10:30 AM IST

రాష్ట్రంలో కరోనా మహమ్మారి విజృంభణ కోనసాగుతోంది. విశాఖపట్నం జిల్లా మాడుగుల నియోజకవర్గంలో కొవిడ్​ వైరస్​ వ్యాపిస్తోంది. గ్రామీణ మండలాల్లో కరోనా విస్తరిస్తుండటంతో ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు.

తాజాగా కె.కోటపాడు మండలం సూదువలస గ్రామానికి చెందిన మహిళా కానిస్టేబుల్​కు కరోనా పాజిటివ్​ నిర్థరణ అయ్యింది. ఆమె అనకాపల్లిలోని మహిళా పోలీసుస్టేషన్​లో కానిస్టేబుల్​గా విధులు నిర్వహిస్తోంది. సూదివలస నుంచి అనకాపల్లికి రోజూ రాకపోకలు సాగిస్తుండగా వైరస్​ బారినపడ్డారు. ఆమె కుటుంబసభ్యుల్లో ఏడుగురికి పరీక్షలు నిర్వహించగా... ఫలితాలు రావాల్సి ఉంది. దీంతో గ్రామంలో వైద్య, రెవెన్యూ, పంచాయతీ సిబ్బంది సర్వే చేశారు.

దేవరాపల్లిమండలం వేచలం, బోయకింతాడ గ్రామాల్లో ఇద్దరికి పాజిటివ్​గా తేలిందని అధికారులు వెల్లడించారు. ఈ మేరకు రెండు గ్రామాల్లో బ్లీచింగ్​, హైపోక్లోరైడ్​ ద్రావణాన్ని పిచికారీ చేశారు. ఆయా ప్రాంతాల్లో రెడ్​జోన్​లను ఏర్పాటు చేశారు. సిబ్బంది గ్రామాల్లో పర్యటించి ప్రజలకు కొవిడ్​ సోకకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను సూచించారు.

ఇవీ చదవండి:కరోనా కట్టడికి పురపాలకశాఖ కార్యాచరణ

ABOUT THE AUTHOR

...view details