విశాఖ జిల్లాలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో వైరస్ విస్తృతంగా వ్యాపిస్తోంది. చోడవరం నియోజకవర్గంలో ఇప్పటి వరకు 26 మందికి కరోనా సోకినట్లు వైద్యులు వెల్లడించారు. చోడవరం మండలంలో 14, రావికమతంలో 6, బుచ్చెయ్యపేటలో 2, రోలుగుంటలో నలుగురికి కరోనా సోకింది. వీరిలో ఇద్దరు కోలుకోగా... మిగతా వారు విశాఖ కేజీహెచ్ ఐసోలేషన్‌లో ఉన్నారు. కేసులు పెరుగుతున్నందున అధికారులు చోడవరం, రావికమతం మండల కేంద్రాల్లో పాక్షిక లాక్డౌన్ అమలు చేస్తున్నారు. శనివారం రావికమతం మండలం గొంపవానిపాలెంలో ఓ మహిళా అనారోగ్యంతో విశాఖలోని కేజీహెచ్‌లో మరణించింది. అదే రోజు ఆ మహిళ మృతదేహాానికి స్వగ్రామంలో బంధువులు అంత్యక్రియలు జరిపారు. మృతి చెందిన మహిళకు కరోనా వైరస్ ఉందంటూ ఆదివారం కేజీహెచ్ వర్గాలు స్పష్టం చేయడం వల్ల బంధువులు, గ్రామస్థులు భయాందోళనకు గురయ్యారు.
చోడవరంలో పెరుగుతున్న కరోనా కేసులు.... ఆందోళనలో ప్రజలు
విశాఖ జిల్లా చోడవరం నియోజకవర్గంలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఇప్పటి వరకు 26 కేసులు నమోదు కాగా... వారిలో ఇద్దరు మాత్రమే కోలుకొన్నారు. మిగతా వారంతా విశాఖ కేజీహెచ్ ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారు. ప్రభుత్వ కార్యాలయాల ఉద్యోగులు కూడా కొవిడ్ బారిన పడటం వల్ల ప్రజలు భయాందోళన చెందుతున్నారు.
పెరుగుతున్న కరోనా కేసులు