విశాఖలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1100 మార్కును దాటేసింది. రోజు రోజుకూ కేసులు వేగంగా విస్తరిస్తున్నాయి. లక్షణాలు లేకుండా ఇతర సమస్యలు లేని కరోనా పాజిటివ్‌గా నిర్థరణ అయిన వారిని ఈ కేంద్రాల్లోనే ఉంచనున్నారు. ఇక్కడ ఉండనవసరం లేదనుకున్న వారు ఇంట్లో వసతులు ఉంటే వైద్యుల సలహాలు అందించేలా చర్యలు చేపట్టనున్నారు. లక్షణాల తీవ్రతను బట్టి, వయసును బట్టి వారిని ఏ అసుపత్రిలో ఉంచాలన్నది నిర్ణయించి చికిత్స అందిస్తారు. దీనివల్ల మరణాల సంఖ్యను పూర్తిగా అదుపుచేసేందుకు వీలవుతుందని జిల్లా యంత్రాంగం భావిస్తోంది.
విశాఖలో సిద్ధమౌతున్న కొవిడ్ కేర్ సెంటర్లు - Covid Care Centers Preparing in Visakha
విశాఖలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1100 మార్కును దాటేసింది. రోజు రోజుకూ కేసులు వేగంగా విస్తరిస్తున్నాయి. మరణాల సంఖ్య కూడా ఏడుకు చేరడం యంత్రాంగాన్ని ఆందోళనకు గురి చేస్తోంది. నిపుణుల అంచనా ప్రకారం కేసుల సంఖ్య వేగంగా పెరిగే అవకాశం ఉంది. దీంతో కొవిడ్ కేర్ సెంటర్ల పేరిట ఇకపై రోగులకు సేవలను అందించేందుకు విశాఖ సన్నద్దమైంది.
కేంద్రం ఇచ్చిన మార్గదర్శకాలకు అనుగుణంగా ఐసీఎంఆర్ ఉత్తర్వుల ప్రకారం కంటైన్మెంట్ క్లస్టర్ల పరిధిని తగ్గించారు.
మరో వైపు లక్షణాలు లేకుండా పాజిటివ్ కేసుల సంఖ్య పెరగడం, వారిని వైద్యుల పరిశీలనలో ఉంచడం ద్వారా 14 రోజులకు నెగిటివ్ వస్తున్న అనుభవాలతో కొవిడ్ కేర్ సెంటర్లను పెద్ద ఎత్తున ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే క్వారంటైన్ కాకుండా కనీస సదుపాయాలతో కొవిడ్ కేర్ కేంద్రాలలో దాదాపు ఐదు వేల మంది వరకు ఉంచే విధంగా సిద్దం చేశారు.
ఇవీ చదవండి: కంచరపాలెం రైల్వే న్యూ కోచింగ్ కాంప్లెక్స్‌లో అగ్ని ప్రమాదం