ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

విశాఖ మన్యంలో జంట హత్యల కలకలం... - Couple murders in Visakha agency

విశాఖ మన్యం మారుమూల ప్రాంతంలో జంట హత్యలు కలకలం సృష్టించాయి. కుమార్తె ఓణీల శుభకార్యానికి ఏర్పాట్లు చేస్తుండగా ఓ తండ్రి హత్యకు గురయ్యాడు. ఈ ఘటనలో నిందితుడిని మృతుడి బంధువులు కొట్టి చంపారు. గ్రామంలో రెండు హత్యలు జరగడంతో శుభకార్యం జరగాల్సిన ఇంట్లో విషాదం నెలకొంది.

Couple murders in Visakha agency
విశాఖ మన్యంలో జంట హత్యలు కలకలం

By

Published : Mar 18, 2020, 4:53 PM IST

విశాఖ మన్యంలో జంట హత్యలు కలకలం

విశాఖ ఏజెన్సీ జి.మాడుగుల మండలం వేర్లమామిడికి చెందిన సూరిబాబు తన కుమార్తె ఓణీల వేడుకకు ఏర్పాట్లు చేస్తున్నాడు. ఈ క్రమంలో అదే గ్రామానికి చెందిన చైతన్యరాజు భార్యతో గొడవ పడి ఆమెను నిందిస్తూ గొడ్డలితో శుభకార్యం జరిగే చోటుకు వెళ్లాడు. ఇక్కడ ఏ గొడవపడ్డద్దొంటూ సూరిబాబు చైతన్యరాజుకు సర్ధిచెప్పేందుకు యత్నించాడు. దీంతో చైతన్యరాజు రెచ్చిపోయి సూరిబాబును గొడ్డలితో హతమార్చి.. ఇంటికి వెళ్లిపోయాడు. ఈ ఘటనతో కోపోద్రిక్తులైన సూరిబాబు బంధువులు చైతన్యరాజును కాళ్లు చేతులు కట్టేసి దాడి చేసి హతమార్చారు. శుభకార్యం జరగాల్సిన గ్రామంలో జంట హత్యలు జరగడంతో విషాదఛాయలు అలముకున్నాయి.

ABOUT THE AUTHOR

...view details